ఖమ్మం లో జిల్లా రోజ్ గార్ సృజన కేంద్రం ప్రారంభం.

 

ముఖ్య అతిథిగా స్వావలంబి భారత్ అభియాన్ అల్ ఇండియా ప్రముఖ్ సతీష్ కుమార్ జి

ఖమ్మం ప్రతినిధి మార్చి 08 (ప్రజాబలం) ఖమ్మం పట్టణంలో వైరా రోడ్డు పాత ఎల్ఐసి ఆఫీస్ ప్రాంతంలో దేవకీ వాసుదేవరావు కృషితో జిల్లా రోజ్ గార్ సృజన కేంద్రం డిస్ట్రిక్ట్ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ ను స్వావలంబి భారత్ అభియాన్ అల్ ఇండియా ప్రముఖ్ , జాతీయ ఎస్.బి.ఎ కేంద్ర ప్రముఖ్ సతీష్ కుమార్ జి ప్రారంభించి మాట్లాడారు . దేశ యువతను స్వయం సంసిద్దులుగా తీర్చిదిద్ది తద్వారా దేశ ప్రగతికి బాటలు వేయటానికి ఈ స్వావలంబి భారత్ అభియాన్ కేంద్రాల ముఖ్యఉద్దేశమని , దేశవ్యాప్తంగా రోజ్ గార్ సృజన కేంద్రాలు ఏర్పటుచేసి గ్రామీణ యువత ఎంట్రప్రెన్యూర్ లుగా తీర్చిదిద్దెందుకు స్వావలంబి భారత్ అభియాన్ కేంద్రాలు దోహదపడతాయని అన్నారు . ఖమ్మం లో జిల్లా రోజ్ గార్ సృజన
కేంద్రం ( డిస్ట్రిక్ట్ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు కృషిచేసిన దేవకీ వాసుదేవరావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర స్వావలంబి భారత్ అభియాన్ సభ్యులు దేవకీ వాసుదేవరావు మాట్లాడుతూ ఖమ్మం యువత ఈ కేంద్రం ద్వారా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని అలాగే కేంద్రం ద్వారా యువత తమ ఆకాంక్షలను నెరవేర్చుకుని సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని కోరారు . ఈ కార్యక్రమానికి స్వావలంబి భారత్ అభియాన్ సభ్యులు జగదీష్ , డా” సాతు లింగమూర్తి , ముక్కా హరీష్ , రమేష్ గౌడ్ మరియు పట్టణ ప్రముఖులు , యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking