ఉచిత అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభం

 

బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని శనివారం బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ప్రారంభించారు.ఈ సందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ…వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని దండేపల్లి మండలం నుండి పట్టణానికి వస్తున్న ప్రజల కోసం,ప్రయాణికుల సౌకర్యార్థం ఉచిత అంబలి పంపిణీ కేంద్ర ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.రెండు నెలల పాటు ఉచిత అంబలి పంపిణీ ఉంటుందని ప్రజలు,ప్రయాణికులు ఉపయోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హారి గోపాల్, మండల అధ్యక్షుడు బొప్పు కిషన్,మండలాల ఇంచార్జ్ గుండా ప్రభాకర్,సీనియర్ నాయకులు వేముల మధు,గడికొప్పుల చంద్రమౌళి,గొపతి రాజయ్య,బందెల రవిగౌడ్,శేఖర్,చతరజు శివ శంకర్,ముష్కమ్ గంగన్న,పాంచాల రమేష్, మోటపలుకుల రమేష్,ఎగ్గడి నాగరాజు,గడమల్ల చంద్రయ్య,బీయ్యాల లచ్చన్న,వొడ్నాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking