విద్యార్థులకు చదువుతో పాటు ఇతర రంగాలకు చెందిన కళ నైపుణ్యాలు అవసరం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 : విద్యార్థులకు చదువుతో పాటు ఇతర రంగాలకు చెందిన కళ నైపుణ్యాలు ఎంతో అవసరమని మున్సిపల్ చైర్మన్ కాంతయ్య అన్నారు.శనివారం పట్టణంలోని స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో సమ్మర్ స్పార్కిల్స్ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ… ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో ఉచిత విద్యను అందించడమే కాకుండా భవిష్యత్ లో విద్యార్థులు సమాజంలో రాణించడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం మరువలేనిదన్నారు. మట్టిలో మాణిక్యలను వెలికి తీయడానికి విద్యా వ్యవస్థ పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెడుతున్నట్లు ఆయన వివరించారు.అంతకుముందు వైస్ చైర్మన్ పోడేటీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…నేటి సమాజం లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు అదనపు అర్హతలు సాధించాలని సూచించారు.కార్పొరేట్ స్కూల్స్ లో మాత్రమే అందుబాటులో ఉండి,విద్యార్థుల ప్రతిభ పాటవాలను గుర్తించే సమ్మర్ క్యాంపు ప్రోగ్రామ్స్ పేద విద్యార్థులకు అందుబాటులోకి రావడం గొప్ప విషయమన్నారు.అనంతరం ఆర్ సీ ఓ స్వరూప రాణి మాట్లాడుతూ…విద్యార్థులకు చదువుతో పాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను సైతం ఎదుర్కొనే సామర్ధ్యలు ఈ ప్రోగ్రామ్ ద్వారా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.15 రోజుల ఈ క్యాంపు లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ లలిత కుమారి మాట్లాడుతూ…200 మంది విద్యార్థులకు పలు అంశాలలో నైపుణ్యతను ప్రోత్సహించే శిక్షణ ఉంటుందన్నారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు.ఏం జె పీ ప్రిన్సిపాల్ గౌతమ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ మహేష్,వనమాలై కల్చరల్ సొసైటీ నిర్వాహకులు విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ వలన కలిగే పలు ప్రయోజనాలను ఉదాహరణలతో వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking