మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు

 

మెదక్ ఏప్రిల్ 22 ప్రజా బలం న్యూస్ :-

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం కార్యనిర్వహక
అధ్యక్షులు మనోహరబాద్ గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి
పేర్కొన్నారు. మనోహర బాద్ మండల పరిధిలోని అన్ని గ్రామాలతో పాటు మండల కేంద్రమైన

ఈద్గాలో ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ పూర్తి చేసుకొని మైనారిటీ సొదరులందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర కెసిఆర్ సేవాదళం ప్రధాన కార్యదర్శి మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి
గ్రామాల్లో శుక్రవారం ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ పండుగను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా వారు కొత్త బట్టలు ధరించి, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపి, ఒకరినొకరు ఆ లింగం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా తూప్రాన్ మండల గ్రామాలలో వైభవంగా రంజాన్ పండుగ వేడుకలను జరుపుకున్నారు.

ఈద్గా వద్ద మత గురువు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తూప్రాన్ లోని మైనార్టీ నాయకులు
నివాసంలో జరిగిన రంజాన్ పండుగ ఉత్సవాలకు స్థానిక ఎస్సై సురేష్ కుమార్, సీఐ శ్రీధర్ , ఎప్డీసి చైర్మన్ వంటెర్ ప్రతాప్ రెడ్డి, మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరిక్రిష్ణ, మెదక్ జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చిట్కుల మహిపాల్ రెడ్డి, హాజరై పాటు అక్కడున్న మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులను ఆ లింగం చేసుకొని పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనార్టీలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎప్డీసి చైర్మన్ వంటెర్ ప్రతాప్ రెడ్డి, జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కల్లూరి చిట్కుల మహిపాల్ రెడ్డి, జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా, రాణి సత్యనారాయణ గౌడ్,
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంధ్రాగౌడ్, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తో పాటు వారి వారి అనుచరుగణాలు కూడా ముస్లిం, మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking