ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 : లక్షెట్టిపేటలో ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా వేడుకలు నిర్వహించారు.శనివారం లక్షెట్టిపేట పట్టణంలోని పలు మసీదుల వద్ద ఉదయం ముస్లిం పెద్దల సమక్షంలో ప్రత్యేక నమాజ్ లు చేశారు.పండుగ పవిత్రత ను పురస్కరించుకొని స్థానిక ముల్కల గూడెం ఈద్గా వద్ద ముస్లీమ్ ల పవిత్ర గ్రంధం ఖురాన్ లోని దివ్య వాక్కులతో సామూహిక ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. అనంతరం మతాలకు అతీతంగా హిందూ ముస్లీం లు పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.పండుగను పురస్కరించుకొని పేదలకు దాన ధర్మాలు చేశారు.అదే విధంగా తమ పూర్వీకులను స్మరిస్తూ కబర్ స్థాన్ వద్ద నివాళులార్పించారు.లక్షెట్టిపేట పట్టణంలోని పలువురు ముస్లీం లకు మున్సిపల్ చైర్మన్ కాంతయ్య,వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,వార్డు కౌన్సిలర్స్,నాయకులు,ఎస్సై ఎస్ లక్ష్మణ్ లు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.