భద్రకాళి ఆలయంలో ప్రారంభమైన కళ్యాణ్ ఉత్సవాలు.

*జ్యోతి ప్రజ్వలన లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు.
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 21:
ఏకశిలా నగరంగా పేరుగాంచిన ఓరుగల్లు నగరం ఇలవేల్పుగా కొలువైన ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో పది రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగే శ్రీ భద్రకాళి, భద్రేశ్వరుల కల్యాణోత్సవలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి ఉదయం నాలుగు గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన పిదప ఉత్సవ అంగీకార ప్రార్ధనను నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన ఉత్సవాలను ప్రభుత్వ చీప్ విప్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆయనతోపాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మేయర్ గుండు సుధారాణి, సిపి రంగనాథ్, రోడ్లు అభివృద్ధి శాఖ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జల వరుణుల శాఖ చైర్మన్ లు శ్రీనివాస్ లు జ్యోతి ప్రజ్వలన లో పాల్గొనాగా వీరందరికీ ఆలయ ఈవో శేషు భారతి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం విశేష పూజలు చేసి మహా మండపంలో మహా ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం శేష వస్త్రాలను ఆలయ పూజారులు అందించారు. కళ్యాణ ఉత్సవాలు వచ్చే నెల మూడు వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి ఒక్కో రోజు ఒక్కొక్క విశేష పూజలతో పాటు యజ్ఞాలు నిర్వహిస్తారని ప్రారంభ రోజు శ్రీకాళహస్తి నుండి విచ్చేసిన కళాకారుల చేత రెండు క్వింటాళ్ల పూలతో గజమాలను అమ్మవారికి అలంకరణ చేయడం జరిగిందని ఇది భక్తులను ఎంతగానో ఆ కొట్టుకుందని అక్షయ తృతీయ పండుగ కూడా కలిసి రావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారని ఈవో శేషు భారతి తెలియజేశారు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking