సద్గుణాలతో వెళ్లి వెరిసిన పవిత్ర రంజాన్ మాసం.

 

ఈద్గా ల్లో ముస్లింలతో కలిసి ప్రార్దనలు చేసిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 22:
పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం ముస్లిం సోదరులు వరంగల్ తూర్పు లోని పలు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నూతన వస్త్రాలు ధరించి, ఒకరికి ఒకరు పలకరించుకుంటూ ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు. పవిత్ర రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆప్యాయంగా పలకరించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటగా కిల వరంగల్ మండలం పోర్టు రోడ్డు లోని ఈద్గాలో ఆ ఈద్గా అధ్యక్షుడు, తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబ్బర్, ఈద్గా నాయకులు చాంద్ పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం మట్టేవాడలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపినరూ.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం, సహాయం, ధానగుణం, కష్టసుఖాలను పరస్పరం పంచుకునే సద్గుణాలను ఈ పవిత్ర రంజాన్ మాసం నేర్పిందని అన్నారు. మత సామరస్యానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీకని
రంజాన్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతూ పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ, కెసిఆర్ రంజాన్ కిట్టు అందజేస్తున్నామని అన్నారు.
మసీదులు, ఈద్గాల అభివృద్ధికి, మరమ్మత్తులకు నిధులిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
మైనారిటీల సంక్షేమానికి దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని నియోజకవర్గంలో మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గం ఒక సెక్యులర్ నియోజకవర్గమని అందరూ కలిసి కట్టుగా జీవిస్తామన్నారు
ఇమామ్,మౌజంలకు నెలకు రూ. 5 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామని పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు షాదీ ముభారక్ ద్వారా రూ.1,00,116 లు ఉచితంగా అందజేస్తున్నదని పేర్కొన్నారు.ముస్లిం సోదర సోదరీమణులు అందరూ తమ బందు‌, మిత్రులతో కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆ అల్లా దయతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. ఈ రంజాన్ వేడుకల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఈద్గా బాధ్యతలు మసూద్, మత పెద్దలు స్థానిక కార్పొరేటర్లు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking