గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 17 : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి కార్యవర్గం చింతగుడ గ్రామ గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవన ప్రారంభోత్సవానికి వెళ్ళి భూమి దాత అయిన గాలి తిరుపతిని ఘనంగా సన్మానించడం జరిగింది. మంగళవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఇలాంటి భవనాలు మండలంలోని అలాగే తెలంగాణ వ్యాప్తంగా నిర్మించుకొని గల్ఫ్ కార్మికుల సమావేశం కోసం ఏర్పాటు చేసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లేడ భూమయ్య ప్రసార కార్యదర్శి మహమ్మద్ హసన్ రాష్ట్ర సలహాదారులు మగ్గిడి తిరుపతి జన్నారం మండల ప్రధాన కార్యదర్శి దుమల ఎల్లయ్య,మండలనాయకులు బండారు తిరుపతి రాజు లింగమూర్తి కల్లేడ తిరుపతి రాజేష్ మల్లేష్ రవి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking