ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 17 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని వెల్గనూర్,పెద్దపెట గ్రామాల్లో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రధాన హామీల అమలు గ్యారంటీ పథకాల కర పత్రములను అంధచేయడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆర్ జీ పీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి మాట్లాడుతూ…మంచిర్యాల నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును భారీ మెజార్టీ తో గెలిపించాలని పేరు పేరున అందరికీ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వెల్గనూర్ సర్పంచ్ బిల్లకూరి శంకరయ్య,పెద్దపేట ఎంపిటిసి బొడ్డు కమలాకర్, మాజీ సర్పంచులు పెంట సత్తయ్య,కొప్పుల మల్లేష్, లింగాల తిరుపతి, నాయకులు అక్కల బుచ్చన్న ఎర్ర వేణి చెన్నయ్య కాండ్రపు శ్రీనివాస్,అంజన్న,గాజుల లచ్చన్న, రవనబోయిన లక్ష్మాయ్యా,బొడ్డు చరణ్, బొల్లం సతేన్న,నాయకులు బత్తుల రమేష్,బండ రాకేష్,ఉదయ్ కిరణ్ రెడ్డి,గొట్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.