పీఎం సూరజ్ పోర్టల్ ఆవిష్కరణ

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 13:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతులమీదుగా సామాజిక అభ్యున్నతి మరియు ఆధారిత ప్రజాసంక్షేమం పీఎం సూరజ్ పోర్టల్ బుధవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు ఆన్లైన్లో దేశవ్యాప్తంగా 523 జిల్లాలను అనుసంధానం చేస్తూ ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ హాజరయ్యారు. పీఎం సూరజ్ పోర్టల్ ద్వారా ప్రధానమంత్రి ఒక లక్ష రూపాయల వరకు లబ్ధిదారులకు ఎస్సీ, యస్ టి, ఓ బి సి, రుణ వితరణ చేయడం జరిగింది. సఫాయి కార్మికులకు ఆయుష్మాన్ హెల్త్ కార్డులు మంజూరు చేయడం జరిగింది ఈ కార్డుల ద్వారా ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమా అందరి కార్మికులకు వర్తింపజేయడం జరుగుతుంది.
కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసులు , కెనరా బ్యాంకు రీజినల్ మేనేజర్ సంజయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, మున్సిపల్ కమిషనర్లు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking