స్వీట్హౌస్ లో అగ్ని ప్రమాదం

వరంగల్ నగరంలో ప్రమాదం
ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి 13::

వరంగల్ నగరం లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిటీ నడిబొడ్డున ఉన్న బ్యాంక్ కాలనీలో బుధవారం స్వాగత్ స్వీట్ హౌస్ లో ఒక్కసారిగా అగ్ని కీలలు అంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు ఆర్పి వేశారు. అగ్ని మంటల కారణంగా స్వాగత్ స్వీట్ హౌస్ పూర్తిగా దగ్ధమైంది. సమయాను కూలంగా స్పందించి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంతో స్వాగత్ స్వీట్ పక్కనే ఉన్న దుకాణాల సముదాయాలకు అగ్ని కిలాలు చుట్టు ముట్టలేదు దీంతో చుట్టుపక్కల నివాస సముదాయాలలో ఉంటున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking