ఖమ్మం ప్రతినిధి మార్చి 13 (ప్రజాబలం) ఖమ్మం 10 రోజులుగా మున్సిపల్ నీటి సరఫరా నిలిచిపోయిందని ఆరోపిస్తూ 25వ డివిజన్ గాంధీ పార్క్ ప్రాంతం వద్ద డివిజన్ ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్ మీదకు వచ్చి నిరసన తెలియజేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు . గత ప్రభుత్వంలో ఎప్పుడు ఈ విధంగా జరగా లేదని అన్నారు . మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు . తాగునీరు లేక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు . నీటి ఎద్దడి మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ అధికారులు ప్రతిరోజు తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు