పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

 

ప్రజాబలం ప్రతినిధి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 13:బుధవారం కలెక్టరేట్ లోని విసి హాల్ లో జరిగిన ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల సన్నద్దత పై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార యంత్రాంగం సిద్దంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ లో భాగమైన అన్ని విభాగాల నోడల్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండి ఎలాంటి లోపాలు తలెత్తకుండా తమ ఎన్నికల విధులను నిర్వర్తించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది డాటా నమోదు పూర్తి చేయాలన్నారు. అన్ని విభాగాల వారికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. ఎన్నికలకు కావాల్సిన సామాగ్రి సేకరణ పూర్తి చేయాలన్నారు. పోలీసు బందోబస్తు పకడ్బందీగా చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సిసి కెమెరాల ఏర్పాటు ఉండాలని, పోలింగ్ కేంద్రం బయట ఎన్ని పోలింగ్ కేంద్రాలకు సిసి కెమెరాలు ఎలా ఏర్పాటు చేయాలో కార్యాచరణ చేయాలన్నారు. ఇవిఎం లు, ఎన్నికల సిబ్బంది రవాణాకు పటిష్ట ప్రణాళిక చేయాలన్నారు. వాహనాలకు జిపిఎస్ సిస్టం అమర్చి, వాటిని ట్రాక్ చేయాలన్నారు. స్వీప్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ఎన్నికల ఖర్చు నియంత్రణ పై పర్యవేక్షణ చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎస్ఎస్టి, వివిటిల ఏర్పాటుచేసి, శిక్షణ ఇవ్వాలన్నారు. క్లిష్టమైన పోలింగ్ బూతుల జాబితాను తయారు చేసి పోలీస్ బందోబస్తు పటిష్ఠపరచాలని అన్నారు. బ్యాలెట్ బాక్స్ వోటింగ్ కు గాను ఫారం 12 -డి ని ముందుగానే అవసరమైన ఓటర్లకు అందజేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంసిఎంసి కమిటీ ద్వారా పెయిడ్ న్యూస్, ప్రకటనల ఖర్చును వ్యయ నియంత్రణ కమిటీకి ఎప్పటికప్పుడు పంపాలని, ప్రెస్ మీట్స్ నిర్వహణ, సమాచార లోపం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ సమావేశంలో డి ఆర్ ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, నోడల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking