ఘనంగా తొలి తెలుగు మహిళా కవియిత్రి మొల్లమాంబ జయంతి

మదర్ థెరిస్సా అనాధ ఆశ్రమంలో అన్నదానం

ఖమ్మం ప్రతినిధి మార్చి 13 (ప్రజాబలం) ఖమ్మం తొలి తెలుగు మహిళా కవియిత్రి మొల్లమాంబ జయంతి సందర్బంగా దరిపల్లి వీరబాబు ఆధ్వర్యంలో ఖమ్మంలోని మదర్ థెరిస్సా అనాధ ఆశ్రమం నందు కుమ్మరి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె సేవలను స్మరించుకుంటూ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలో సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా మొల్లమాంబ రాశారని, మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వివక్షతకు వ్యతిరేకంగా తన రచనలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిలివేరు జనార్ధన్ రిటైర్డ్ ఎస్పీ గుమ్మడిదల్ల సుబ్బారావు, దునుకు వేలాద్రి, దరిపెల్లి శ్రీనివాస్, కుదురుపాక నరసయ్య, కుడారపు సూరిబాబు, కొత్తపల్లి చలపతిరావు, తీగుళ్ల వెంకటరమణ, తొర్లికొండ నరసింహారావు, గుడిమెట్ల రజిత, దరిపల్లి చంద్రశేఖర్, మొగిలిచర్ల సైదులు, ఖమ్మంపాటి రమేష్, మొగిలిచర్ల వెంకటేష్, మల్లికార్జున్, తిగుళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking