దూదేకుల/నూర్ బాషా కులస్తులకు కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి

-నూర్ బాషా/ దూదేకుల (బిసి) ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా

ఖమ్మం ప్రతినిధి మార్చి 13 ప్రజాబలం ఖమ్మం దూదేకుల /నూర్ బాషా కులస్తులకు కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర నూర్ బాషా/ దూదేకుల (బిసి) ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నిన్న ప్రెస్ క్లబ్ లో మీడీయా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షల కి పైగా జనాభా దూదేకుల కులస్తులు ఉన్నారని ఆర్దికంగా సామాజీకంగా వెనుకబడి ఉన్నారని దూదేకుల కులస్తులు కాంగ్రెస్ పార్టీకీ ఏక పక్షంగా పనిచేశారని సిఎం రేవంత్ రెడ్డి దూదేకుల కులంకు కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఆధుకోవాలని అన్నారు.ప్రక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కుడా దూదేకుల కులానికి కార్పోరేషన్ ఉందని తెలంగాణ లో సైతం బీసీ కులాలలో దూదేకుల కులస్తులు మెజార్టీ స్థానంలో ఉన్నారని ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ పాలనాలో దూదేకులకు కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా రాష్త్ర ప్రదాన కార్యధర్శి షేక్ రహీం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జానీ బేగం జిల్లా మహిళా అధ్యక్షురాలు సఖీనాబీ జిల్లా అధ్యక్షులు షేక్ రహీం పాషా నగర అధ్యక్షులు రసూల్ జిల్లా నాయకులు షేక్ లాల్ సాహెబ్ తదితురులు పాల్గోన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking