పద్మశాలీలకు కార్పొరేషన్ ప్రకటించటంతో హర్షాతిరేకాలు

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండ సురేఖల చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన పద్మశాలీలు

ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి 13:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశాలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించడంతో వరంగల్ జిల్లా పద్మశాలీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండ సురేఖల చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు చాటుకున్నారు. బుధవారం గోపాల స్వామి గుడి కూడలిలోని కొండ లక్ష్మణ్ విగ్రహం వద్ద జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ ,పర్యావరణ శాఖ మంత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అయిన కొండ సురేఖల చిత్రపటానికి వరంగల్ జిల్లా పద్మశాలి సంఘాల ప్రతినిధులు చేనేత కార్మికుల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలుపుతూ క్షీరాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పాలతో అభిషేకించిన అనంతరం ఒకరికి ఒకరు సీట్లు పంచుకొని అభినందనలు తెలియజేసుకున్నారు. మశాలి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి పద్మశాలిల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించడం ఆనందదాయకంగా ఉందని చేనేత కార్మికులు తయారుచేసిన ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినందుకు పద్మశాలీల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ వడ్నాల నరేందర్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోరంటాల రాజు గౌరవ అధ్యక్షులు గుండేటి నరేంద్ర కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనంద్, వైద్యం రాజగోపాల్, కుమారస్వామి, పెద్ద సంఘాల, చేనేత కార్మికులు, మహిళలు రాష్ట్ర విద్యా విభాగం అధ్యక్షులు వంగరి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking