ప్రజాబలం మియాపూర్
మియాపూర్ : 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ లోని మక్త గ్రామం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. మక్త లోని ఎస్ డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జాతీయ గీతానికి డ్యాన్స్ చేసి దేశ సైనికులకు అంకితం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవానుల త్యాగాలను కీర్తించారు. దేశానికి స్వేచ్చ, స్వాతంత్ర్య ఫలాలు అందించిన సమరయోధుల త్యాగలను మరువకూడదని, వారి ఆశయ సాధనకృషి చేయాలనీ బిజెపి శ్రేణులు కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రాఘవేందర్ రావు, నాగుల్ గౌడ్, గుండె గణేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.