స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఉదయపు అల్ఫాహారం, పూల మొక్కల పంపిణి.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 ఆగస్టు 2024:
మణికొండ అల్కాపూర్ లో గల మహాత్మా గాంధిపార్క్ లో భారతదేశ 78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా మాజి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రముఖ హై కోర్ట్ న్యాయవాది ఏ.హనుమంతా రెడ్డి ఐ.పీ.ఎస్ జండా వందనమ్ చేయడం జరిగిందని ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలియ పరుస్తూ అధిక సంఖ్యలో విచ్చేసిన అతిథిలందరికీ మణికొండ 8 వ వార్డ్ కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్ ఉదయపు అల్పాహారం ఏర్పాటు జేసినారని, ఈ సందర్భముగా ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపకార్యదర్షి ఉపేందర్నాధ్ రెడ్డి వివిధ రకాల పూల మొక్కల పంపిణి చేసినారని, ఈ కార్యక్రమంలో ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కౌన్సిలర్లూ బిట్లు పద్మారావు, ఆలస్యం నవీన్ కుమార్, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ప్రముఖుడు దిన్నానంద్, కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, కార్యదర్శి షేక్ ఆరిఫ్ఫ్ మొహమ్మద్, ఉపకార్యదర్షి ఉపేందర్నాధ్ రెడ్డి, కార్యవర్గ సభ్యుడు రామ సుబ్బారెడ్డి, అలకాపురి వాసులు తది తరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking