మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

ప్రతి పౌరుడు బాధ్యతగా దేశసేవ కొరకు పాటుపడాలి
జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు సిబ్బందికి 78 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి .

మెదక్ ఆగస్టు 15 ప్రజాబలం న్యూస్ :-

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్.పి శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయగీతాలాపన చేసారు. అనంతరం జిల్లా ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు గౌరవనీయ శ్రీ.డాక్టర్ కే.కేశవ రావు ప్రభుత్వ సలహాదారు ( ముఖ్య అతిదిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసినారు. వారితో పాటు మెదక్ నియోజక వర్గ ఎంఎల్ఏ శ్రీ. మైనంపల్లి రోహిత్ , మరియు జిల్లా కలెక్టర్ శ్రీ. రాహుల్ రాజ్ ఐ.ఏ.ఎస్. , ఎస్.పి శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్ , జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ. వెంకటేశ్వర్లు ,జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ శ్రీ.ఎస్.మహేందర్ మరియు ప్రజాప్రతినిదులు జిల్లా అన్నీ శాఖాల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్.పి శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్ మాట్లాడుతూ.. సిబ్బందికి, జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. మాతృ భూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి, మనకు సమకూర్చి పెట్టిన ఈ స్వాతంత్ర్య భారత్ నేటితో 77 వసంతాలను పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా ఆ మహానీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలు మనం సమాజానికి ఏవిధంగా సేవాచేయాలని మన విధులను గుర్తు చేస్తాయని అన్నారు. భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న మతాల కలయిక మన భారత దేశం అని, ఇన్ని విభిన్న సంస్కృతి, సాంప్రధాయలున్న వ్యక్తులు లేదా సమూహాల మధ్య సామరస్యం మరియు ఐక్యత భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందని, భారతీయులుగా పుట్టినందుకు మనందరం గర్వపడాలన్నారు. మనం మన విధులను సక్రమంగా నిర్వహించినప్పుడే బార్డర్లో సైనికులు అందించే సేవలకు మన సేవలు ఏమాత్రం తీసుపోవని గుర్తు చేస్తూ, మన విధులను అంకితభావంతో నిర్వహించాలని పోలీసులుగా మన పాత్ర చాలా కీలకం అన్నారు. అలాగే మన ఈ స్వేచ్చ, స్వాతంత్ర్యాల వెనక ఎంతో మంది పోరాటయోదుల త్యాగం దాగి ఉన్నదని, వారి ప్రాణ త్యాగాలవలనే మన మందరం ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవము జరుపుకుంటున్నాము కావున మనము కుడా మన వంతు భాద్యతగా దేశసేవ కొరకు పాటుపడాలని, సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి జిల్లా పోలీస్ వ్యవస్తకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు యెస్.పి. అడ్మిన్ శ్రీ.మహేందర్ మెదక్ డి.ఎస్.పి.శ్రీ.ప్రసన్న కుమార్ ఏ.ఆర్ డి.ఎస్.పి.శ్రీ. రంగ నాయక్ ఆర్.ఐ.శ్రీ.శైలేందర్ , డి.యెస్.బి సి.ఐ. శ్రీ. శ్రీ.సందీప్ రెడ్డి డి.సి.ఆర్.బి. సి.ఐ. శ్రీ. మధుసూదన్ గౌడ్ డి.పి.ఓ సిబ్బంది, ఎస్.బి. సిబ్బంది, డి.సి.ఆర్.బి సిబ్బంది, ఐ.టి. కోర్ సిబ్బంది, మరియు తదితరులు పాల్గొన్నారు.
అలాగే పోలీస్ శాఖ లోని వివిధ విభాగాలలో పోలీస్ విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సేవ పతకాలకు ఎంపిక చేసి వారికి ప్రశంస పత్రాలతో పాటు పతకాలు ప్రభుత్వ సలహాదారు గౌరవనీయ కే.కేశవ రావు ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) గారి మరియు మెదక్ నియోజక వర్గ ఎంఎల్ఏ శ్రీ. మైనంపల్లి రోహిత్ గారి, జిల్లా కలెక్టర్ శ్రీ.రాహుల్ రాజ్ ఐ.ఏ.ఎస్.గారి, ఎస్.పి శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్ గారి చేతుల మీదుగా అందజేశారు. అంకితభావంతో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికీ రివార్డులు, అవార్డులు సేవా పథకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఉత్తమ సేవ పతకం
1. గొల్ల దేవదాస్ హెడ్ కానిస్టేబుల్ శివంపేట పి.ఎస్
సేవ పతకం
1. పి. దర్మయ్య హెడ్ కానిస్టేబుల్ తూప్రాన్ పి.ఎస్
2. పి. సురేష్ బాబు హెడ్ కానిస్టేబుల్ మెదక్
3. జె. రాములు హెడ్ కానిస్టేబుల్ మెదక్
4. డి. ఆనందం హెడ్ కానిస్టేబుల్ మెదక్
5. పి. దత్తు రావ్ హెడ్ కానిస్టేబుల్ మెదక్
6. ఆర్. సర్వేశ్వర్ హెడ్ కానిస్టేబుల్ డి ఎ ఆర్ మెదక్
ప్రశంస పత్రాలు పొందిన వారు వివరాలు
1. శ్రీమతి ఎం.రేణుక రెడ్డి సిఐ అల్లాదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్
2. జి.శివానందం సబ్ ఇన్స్పెక్టర్ తూప్రాన్ పోలీస్ స్టేషన్
3. రుక్సానా బేగం ఏఎస్‌ఐ మెదక్ టౌన్ పీఎస్
4. బేతయ్య హెచ్‌సి 1538 హవేలీ ఘన్‌పూర్
5. చ. దయానంద్ పిసి 2303 కుల్చారం పిఎస్
6. ఎన్ ప్రేమ్ కుమార్ పి. సి. 2632 అల్లాదుర్గ్ PS
7. ఎం.మహేందర్ పీసీ-840 శివ్వంపేట పీఎస్
8. జి. భాస్కర్ పీసీ- 802 చేగుంట పీఎస్
9. ఎన్.చంద్రం పీసీ-2113 శంకరంపేట-ఆర్
10. మల్లేశ్వరి రేగోడ్
11. ఎండి.తస్లీమ్ డబ్ల్యూ పిసి -1000 మనోహరాబాద్ పోలీస్ స్టేషన్
12. బి.విట్టల్ మెదక్
13. ఫసియుద్దన్ మెదక్
14. N.రేణుక
15. యు.యాదగిరి
16. ఎం.రమేష్
17. జె.వరప్రసాద్
18. లావణ్య
మినిస్టీరియల్ సిబ్బంది
1. శ్రీ. వాల్య నాయక్
2. శ్రీ. ఎన్.సాగర్ సీనియర్ అసిస్టెంట్.

Leave A Reply

Your email address will not be published.

Breaking