తూప్రాన్ ఆగస్టు 15 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని పల్లవి మోడల్ స్కూల్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ పివి రమణ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జంట నగరాల్లో ఎంతో పేరుగాంచిన పల్లవి మోడల్ స్కూల్ పాఠశాలను తూప్రాన్ లో ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఎక్కువ శాతం విద్యార్థులు అడ్మిషన్ అవడం ఎంతో సంతోషకరమన్నారు. తమ పాఠశాలలో విద్యాతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
నలంద కళాశాలలో…
తూప్రాన్ పట్టణంలోని నలంద విద్యాసంస్థల్లో చైర్మన్ డాక్టర్ పివి రమణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. నలంద విద్యా సంస్థను ప్రారంభించి 31 సంవత్సరాలు గడిచిందన్నారు. ఇన్ని సంవత్సరాల్లో తమ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు నేడు ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రైవేటు రంగ సంస్థల్లో, ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. మెదక్ జిల్లాలోనే నలంద విద్యాసంస్థ ఎంతోమంది ప్రజల ఆదరణ పొందడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్, డిగ్రీ పీజీ కళాశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
