ఖమ్మం పాలేరు నియోజకవర్గ నాయకులకు ఆహ్వానం
ఖమ్మం క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేయనున్న ఎంపీ ఆర్ఆర్ఆర్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 14 ప్రజాబలం (ఖమ్మం) ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం, కూసుమంచి క్యాంపు కార్యాలయాల్లో వేడుకలను నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు జెండా వందనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో జరిగే వేడుకల్లో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి జెండా ఎగురవేస్తారని తెలిపారు. కావున ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని దయాకర్ రెడ్డి పిలుపునిచ్చారు