సీఎం సభకు తరలిరండి

 

పాలేరు నియోజకవర్గ రైతు సోదరులకు మంత్రి పొంగులేటి పిలుపు

పాలేరు నియోజకవర్గం ప్రతినిధి ఆగస్టు 14 (ప్రజాబలం) పాలేరు నియోజకవర్గం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా ఈనెల 15న రెండు లక్షల వరకు రుణం తీసుకున్న రైతు సోదరుల రుణమాఫీ ప్రక్రియ మొదలు కానుంది. వైరా నియోజకవర్గం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో సీఎం సభకు పాలేరు నియోజకవర్గానికి చెందిన రైతు సోదరులందరూ అధిక సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ రెవెన్యూ గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. రైతు సోదరులతో పాటు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking