లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా మహాత్మా సంతోష్ నియామకం

 

ప్రజాబలం ప్రజాబలం జిల్లా ప్రతినిధి ఆగస్టు 14 : లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సేనియర్ అద్యాపకులు డాక్టర్ మహాత్మా సంతోష్ నికళాశాల ఉన్నత విద్యా కమిషనర్ దేవసేన మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ ఆదర్శ కళాశాలకి పూర్తి అదనపు బాద్యతల ప్రిన్సిపాల్ గా నియమించారు. కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేందర్ సింగ్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు.కాగా ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం డాక్టర్ సంతోష్ మహాత్మా బుధవారం లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గావిధుల్లో చేరారు.కళాశాల అధ్యాపకులు బోధనేతర సిబ్బంది నూతన ప్రిన్సిపాల్ డాక్టర్ మహాత్మా సంతోష్ కి పుష్పగుచ్చంతో,శాలువాతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ మహాత్మా సంతోష్ మాట్లాడుతూ కళాశాల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కళాశాలలో మౌలిక వసతులు, బోధనా సేవల్లో అంతరాయం లేకుండా విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందజేయడంలో తనవంతు పాత్ర నిర్వహిస్తానని తెలిపారు.త్వరలోనే కళాశాలకు అటానమస్ హోదా తేవడంలో చిత్తశుద్దితో పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడుతూ… ప్రభుత్వ కళాశాల చదివుతో ఉన్నత మైన జ్ఞానం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అద్యాపకులు సురేష్, తిరుపతి,సంతోష్ కుమార్,చంద్రశేఖర్, కవిత,సంద్యారాణి, మల్లన్న,శ్రీనివాస్,రాజ్ కుమార్, రామంచంద్రం, మహేష్ కుమార్, సతీస్,నరేష్,బోధనేతర సిబ్బంది మల్లారెడ్డి, వెంకటేష్,జలంధర్, కుమార్,శ్రీనివాస్,లతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking