లక్షెట్టిపేట లో హిందూ సంఘాల ఐక్య వేదిక అధ్వర్యంలో పిలుపు ఇచ్చిన బందు సంపూర్ణం

 

ప్రజాబలం మంచిర్యాల ప్రతినిధి ఆగస్టు 14 : బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ ముసుగు లో హిందువుల పైన జరుగుతున్న హత్యలు,అత్యాచారాలకు,అనైతిక దాడులకు నిరసనగా హిందూ సంఘాల ఐక్య వేదిక అధ్వర్యంలో బందుకు పిలుపు ఇవ్వడం జరిగింది,బందుకు అన్ని వ్యాపార సంఘాల వారు మద్దతు తెలిపి బందు పాటించడం జరిగింది, ప్రజలందరి నుండి సంపూర్ణ మద్దతు ఉంది అని తెలిపారు, ఈ సందర్భంగా హిందూ సంఘాల వారు మాట్లాడుతూ… బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు భారత్ లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని, భారత్ లో కూడా మతోన్మాద ఉగ్రవాద శక్తులు ఉన్నాయని వాటిని అంతమొందించాలని తెలిపారు,హిందువులు అందరూ ఒక్క తాటి పైకి రావాలని పిలుపనిచ్చారు, హిందువులను కులాల వారిగా విడదీసి వేరు చేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని , అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని అన్నారు,బంగ్లాదేశ్ లో పరిస్థితులు చూస్తుంటే మతోన్మాద శక్తులు చంపడానికి వారు ఏ కులము అనేది చూడడం లేదు,వారు హిందువు అయితే చాలు వారిపై విచ్చలవిడి గా దాడులు చేస్తూ చంపుతున్నారు, హిందువుల కోసం ఉన్నది భారత దేశం మాత్రమే అని తెలిపారు,భారత్ లో సెక్యులర్ అనే భావనతో అన్ని మతాలు ఒకటే , సమానం అనే ఆలోచన నుండి బయటకు రావాలని కోరారు.బందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేసారు,
కార్యక్రమంలో రమేష్ చంద్ జైన్,జగన్ మోహన్ రెడ్డి,వేముల మధు,మోటపల్కుల సతీష్,ఎంబడి వెంకటేష్,బాణాల రత్నం,కోమాకుల రవి.లకవత్ ఈశ్వర్, నల్ల ఆనంద్,వేముల మల్లేష్,రమేష్,నరెడ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking