పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 14 : నేడు జరగబోయే స్వాతంత్ర్య వేడుకలను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన అయన మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆలోచించాలని, దేశభక్తిని,నీతి, నిజాయితీని పెంపొందించుకోవాలన్నారు.స్వార్థం తగ్గించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దమ్మ నారాయణ, మండల మాజీ అధ్యక్షులు దొంత నర్సయ్య, మండల ఉపాధ్యక్షులు భైరం లింగన్న, సలహాదారులు గరిసే రవీందర్,ఉపాధ్యక్షులు చుంచు రమేష్, అడ్లూరి దేవేందర్, కల్లేపల్లి విక్రమ్, గుత్తికొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, ప్రచార కార్యదర్శి మామిడి సందీప్,ఝచాతరాజు రాజేష్,అడ్లూరి శివకుమార్,పెండెం సత్తయ్య,వేల్పుల ప్రేమ్ సాగర్, దుర్గాంజనేయులు, మినుముల వేణు, పెండెం చక్రపాణి, పెద్దిరెడ్డి యాకోబు తదితరులు పాల్గొన్నారు.