ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 14 : మంచిర్యాల జిల్లాలోని మండలంలోని కొర్విచెల్మ గ్రామానికి చెందిన కారుకూరి సుధాకర్,ముద్దసాని రాజమౌళి ఇద్దరు కలిసి జెడ్ పి హెచ్ ఎస్ కొర్విచెల్మ పాఠశాలలో 6 వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న 70 మంది విద్యార్థిని, విద్యార్థులందరికీ 14,200 విలువగల 70 షూస్ జతలు, సాక్స్ అందించడం జరిగింది దాతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గం చిన్నయ్య, ఉపాధ్యాయులు అభినందించడం జరిగింది. మునుముందు కూడా పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు
చింతం రామయ్య, పత్తి సత్తయ్య,కొండు జనార్దన్,చిన్నయ్య ,సుధాకర్,శ్రీనివాస్, చంద్రమౌళి,రావెనవేని రవి,భూమన్న,విజయచందర్,గంగారాములుగ్రామ పెద్దలు, యువకులు,పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.