ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 15 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు జెండా ఆవిష్కరణ చేశారు.మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ నల్మాస్ కాంతయ్య,ఎంపీడీఓ కార్యాలయం లో ఎంపీపీ అన్నం మంగ,పోలీస్ స్టేషన్ లో సీఐ కృష్ణ, న్యాయస్థానంలో న్యాయమూర్తి షరీఫ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓఝా,డీసీఎమ్మెస్ కార్యాలయంలో చైర్మన్ తిప్పని లింగయ్య,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏ ఓ ప్రభాకర్,మండల విద్యావనరుల కేంద్రంలో ఎం ఈ ఓ రవీందర్,ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు బోనగిరి కుమార్, తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ రాఘవేంద్ర రావు జెండా ఎగురవేసి వందనం చేశారు.అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలలో, కార్యాలయాలలో జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking