నిర్మల్ జిల్లా పోలీసు అసోషియేషన్ అధ్యక్షులు మీర్ విరాసత్ అలీ
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంతో బాధ్యతాయుతంగా శాంతి భద్రతల విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ధన,మాన ప్రాణాలకు రక్షణగా ఉంటూ వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి నిష్పక్షపాతంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులపై తేదీ:14-08-2023 రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలీసుల మనోభావాలను దెబ్బ తీసేలా విమర్శించడం సరికాదని నిర్మల్ జిల్లా పోలీసు అసోషియేషన్ అధ్యక్షులు మీర్ విరాసత్ అలీ జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది తరుపున పత్రిక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ పోలీసు అంటే దేశంలోనే మంచి గుర్తింపు ఉందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల ఆధారాభిమానులు పొందుతుంటే.ఏలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, కించపరిచేలా అవాస్తవమైన అబండాలు మోపుతూ.పోలీసులుపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అనే విషయాన్ని ఆలోచించాలని అన్నారు.ఈ మధ్యకాలంలో కొంత మంది రాజకీయ నాయకులు ఇలాంటి మాటలతో తెలంగాణ పోలీసుల మనోధైర్యం దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మేము చట్టానికి, న్యాయ స్థానాలకు లోబడి పనిచేస్తాం తప్పా ఏవరి ఒతిడ్లకు లొంగీ పని చేయరని, భవిష్యత్ లోనైన పోలీస్ వ్యవస్థను విమర్శించే ప్రక్రియను మానుకోవాలని సూచించారు