భారత దేశం గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయింది

-మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి ఘన నివాళి

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 27 :

మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ శుక్రవారం మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సోత్కు సుదర్శన్ లు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడం వల్ల భారత దేశం గొప్ప ఆర్థిక వేత్తను, సంస్కరణ వాదిని కొల్పోయిందన్నారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, వాణిజ్య మంత్రిగా ఆర్థిక సలహాదారుగా మన దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు.రెండుసార్లు భారత దేశానికి ప్రధానమంత్రిగా పని చేసిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ప్రభాకర్ రావు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నెరువట్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు మంకు రమేష్, కడారి జీవన్ కుమార్, ఎం.డి ఆఫీస్, ఎండి సుకుర్, రాచర్ల రవికుమార్, మంద తిరుమల్, ఆంజనేయులు, సాగర్ శ్రీనివాస్, కడలి శ్రీనివాస్, జమాల్పూర్ నర్సోజి, మాయ తిరుపతి, బియ్యాల రవికిరణ్, కృష్ణ, రంజిత్, ఎర్ర రాజు, నామిని ముత్తయ్య, దుర్గం ప్రభాకర్, రమేష్, ఏటూరు సత్యనారాయణ, నార్లపూర్ వెంకటేష్, డాక్టర్ లింగన్న, మాయ లింగయ్య, తాడవేన కనకయ్య, కొమురయ్య, కనకయ్య, జావిద్ ఖాన్, శ్రీనివాస్, నల్లుల శంకర్, చంద్రకాంత్, ముడారపు శేఖర్, మొగిలి రమేష్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking