ప్రభుత్వం పత్తికి అందిస్తున్న కనీస మద్దతు ధరతో రైతులు లబ్ధి పొందాలి

 

జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.డి.షాబొద్దిన్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 27 : ప్రభుత్వం కనీస మద్దతు ధరతో పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని జిల్లా మార్కెటింగ్ అధికారి ఒక ప్రకటనలో ఎం.డి.షాబొద్దిన్ తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో జిన్నింగ్ మిల్లులలో ఏర్పాటు చేసిన సి.సి.ఐ కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని,ఈ సంవత్సరం ఈ నెల 27వ తేదీ వరకు 1 లక్ష 6 వేల 420 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.వాతావరణ మార్పులు,ఇతర కారణాల వలన పత్తి స్థితి మారిందని, నవంబర్ 2వ వారంలో ఎం.ఈ.సి.హెచ్.పద్ధతిలో కొనుగోలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. చెన్నూర్,లక్షెట్టిపేట కేంద్రాలలో పత్తి కొనుగోలు అధికారి డి.కె. నాయక్,కిరణ్ దేశ్ ముఖ్ ఆధ్వర్యంలో జనవరి 1, 2025 నుండి ఎం.ఈ.సి.హెచ్. పద్ధతిలో పత్తి కొనుగోలు జరుగుతుందని, బెల్లంపల్లి పరిధిలో ఇప్పటికే కొనుగోలు కొనసాగుతుందని తెలిపారు. 8 శాతం తేమ ఉంటే క్వింటాల్ కు 7 వేల 421 రూపాయలు, 9 శాతం ఉంటే 7 వేల 346 రూపాయలు,10 శాతం ఉంటే 7 వేల 272 రూపాయలు,11 శాతం ఉంటే 7 వేల 198 రూపాయలు,12 శాతం ఉంటే 7 వేల 124 రూపాయలు మద్దతు ధర అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులు తమ పత్తి పంటను ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking