మంచిర్యాల పిఏసిఎస్ చైర్మన్ సందెల వెంకటేష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 01 : మంచిర్యాల జిల్లాలోని వేంపల్లి వ్యవసాయ క్షేత్రంలో మంచిర్యాల పిఏసిఎస్ చైర్మన్ సందెల వెంకటేష్ నూతన సంవత్సర వేడుకలు వ్యవసాయ దినసరి కూలీలతో ఘనంగా నిర్వహించారు.బుధవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రతిరోజు దినసరి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న ఆడపడుచులతో వేడుకలను చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అంతేకాకుండా రైతులు,వ్యవసాయ దిన చర్య గా పనిచేస్తున్న వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతు చేదోడుగా పనిచేస్తు,వారికి అండగా వుండాలి భగవంతుని ప్రార్థిస్తున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు,వ్యవసాయ కూలీలు తదితరులు పాల్గొన్నారు.