ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. చందమామపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం కావడం. భారత్ సరికొత్త చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించిందని శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించిందని,ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా,చైనా, రష్యాలకు సైతం సాధ్యం కాని ప్రయోగాన్ని విజయవంతం చేసి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిందని కొనియాడారు. యావత్ భారతావని అకాంక్షలను నెరవేర్చిన ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇందుకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.