నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో స్థానిక ఎన్టీఆర్ స్టేడియం లో జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి,జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా ఓటు హక్కు వినియోగం, ఆవశ్యకతపై నిర్వహించిన’5కె రన్’ను ఐ ఓట్ ఫర్ షూర్/నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో స్థానిక ఎన్టీఆర్ స్టేడియం లో జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి,జిల్లా ఎస్పీ ప్రవీణ్జెం కుమార్ లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ ర్యాలీ విద్యార్థులు, అధికారులతో ఎన్టీఆర్ స్టేడియం నుండి మంచిర్యాల చౌరస్తా తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ
నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను.అది నా బాధ్యత అని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలని కోరారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని ఓటు విలువ, ఓటరు నమోదు,ఓటు హక్కు వినియోగంపై వివరిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు కీలకమని, వచ్చే అక్టోబరు ఒకటి నాటికి 18 సంవత్సరములు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఎవరైనా ఓటు నమోదు చేసుకోని వారు ఉంటే నమోదు చేసుకోవాలని అన్నారు.
ఓటరుగా నమోదు కావడం మన బాధ్యత అని అన్నారు.రెండవ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో ఫారమ్ 6 ద్వారా కొత్తగా ఓటరుగా నమోదు, ఫారమ్ 8 ద్వారా ఓటరు మార్పులు చేసుకోవచ్చునని, కళాశాలల యాజమాన్యాలు 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినీ విద్యార్థులకు ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు చైతన్యంపై ప్రతి వారం ఒక కొత్త ప్రచార కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పోలింగ్ రోజున ఖచ్చితంగా వంద శాతం ఓటు నమోదు కావడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,ప్రతి ఒక్కరూ నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అది నా బాధ్యత అని నిర్ణయించుకోవాలని, గతంలో తక్కువ ఓటింగ్ జరిగిన ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెరిగేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,దీనికి అందరూ సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, వివిప్యాట్ యంత్రాల ద్వారా ఓటు నమోదు చేసే విధానాన్ని ప్రదర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి రత్న కళ్యాణి
సి ఈ ఓ సుధీర్,జిల్లా పౌర సంబంధాల అధికారి తిరుమల, విద్యా శాఖ అధికారి రవీందర్, తహసీల్దార్ లు,కలెక్టరేట్ సిబ్బంది, ఎంపీడీఓ, ఎంపీవో లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking