ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 24 (ప్రజాబలం) ఖమ్మం
ఈ నెల 27న నెల నెలా వెన్నెల 73వ నెల కార్యక్రమం 6వ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం 6గం “లకు భక్త రామదాసు కళాక్షేత్రం ఖమ్మం నందు జరుగుతున్నదని దానిని జయప్రదం చేయాలని నెలనెలా వెన్నెల కార్యదర్శి ఏ. సుబ్రహ్మణ్య కుమార్
విజ్ఞప్తి చేశారు భక్త రామదాసు కళాక్షేత్రం ఖమ్మం నందు నెల నెలా వెన్నెల కార్యక్రమం 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 2007 లో నెల నెలా వెన్నెల ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ప్రారంభం అయింది. అని అనేక అంతరాయాలు , కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక ఆటంకాలు ఎదురైనా. 2015నుండి ఆగకుండా అమరజీవి అన్నా బత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ ,ప్రజానాట్యమండలి, కళా పరిషత్ ఆధ్వర్యంలో 7వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నామని కార్యక్రమ విజయానికి తోడ్పడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. వెన్నెల ఇంతటి విజయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి అద్భుతమైన నాటికలు నాటకాలు తీసుకొస్తూ వెన్నెలను పరిపుష్టం చేస్తూ ఖమ్మం నిజంగానే కళల గుమ్మం అనే విధంగా నాటక సమాజాలు తోడ్పడ్డాయని, ప్రేక్షకుల ఆదరణ మమ్మల్ని మరింత ఉత్సాహంగా పనిచేయడానికి పురిగొలుపుతున్నాయని పేర్కొన్నారు. మా కృషిని అభినందిస్తూ మా వెన్నంటి ప్రోత్సహిస్తున్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా కళలను ప్రోత్సహిస్తున్న భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ పెద్దలకు కళాభివందనలు తెలిపారు.అనంతరం కళాపరిషత్ అధ్యక్షులు కళాపరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నాగబత్తిని రవి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేముల సదానంద ,అద్యక్షులు మోటమర్రి జగన్మోహన్ రావు, నామ లక్ష్మీనారాయణ ప్రసంగించారు ఈ నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు. ఆత్మీయ అతిథులుగా మొగిలి శ్రీనివాసరెడ్డి , సంక్రాంతి ప్రసాదరావు, డాక్టర్ పెంటేల అసాధారణ , డాక్టర్ కావ్య యాలముడి పాల్గొంటారని, కార్యక్రమాలలో భాగంగా ఖమ్మం లెజెండ్ కళాబందు వి వి అప్పారావు, పౌరాణిక నాటక రంగస్థల ప్రముఖులు పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్, సామాజిక కార్యకర్త అన్నం ఫౌండేషన్ అన్నం శ్రీనివాసరావు లకూ అభినందన సత్కారం ఉంటుందనీ, “రైతే రాజు” నాటిక ప్రదర్శన ఉంటుందనీ ఈ నెల జరిగే కార్యక్రమాన్ని ప్రజలు, కళాకారులు, కళాభిమానులు , అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.