ఆల్కాపుర్ లో గల నేతాజీ పార్క్ నందు భారతీయ యోగ సంస్థ

పత్రికా ప్రకటన: రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 31 అక్టోబర్ 2023: మణికొండ మున్సిపల్ కౌన్సిల్ ఆల్కాపుర్ లో గల నేతాజీ పార్క్ నందు భారతీయ యోగ సంస్థ నేతాజీ పార్క్ శాఖ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకలకు భారతీయ యోగ సంస్థ తెలంగాణ ఈస్ట్ డిస్ట్రిక్ట్ 1 అధ్యక్షులు వర్జన్ నాయక్, కార్యదర్శి యుగేందర్, శాఖ ప్రారంభానికి విశేష కృషి చేసిన దేవేందర్ హాజరయి, శాఖ ఇంచార్జి సుగుణ, ముఖ్య శిక్షకులు ప్రసాద్ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం మహిళా సాధకులు అందరూ సుగుణ బొలిశెట్టిని, ప్రసాద్ కర్ణిని మరియు ఇటీవల జిల్లా యోగ పోటీలలో రెండవ విజేతగా నిలిచిన రాజుని దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్య్రమానికి సమీప శాఖ ఇంచార్జి ప్రదీప్ రావు వారి సాధకులతో సహా హాజరయి కార్యక్రమం విజయవంతం చేశారు. చివరిగా ధన్యవాదాలు తెలుపుతూ యోగా ద్వారా ఆరోగ్య ఫలితాలను పొందాలని స్థానిక నివాసులు అందరికీ విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking