అప్పకపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు

భూమి పూజ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ,పొంగులేటి శ్రీనివాస రెడ్డి
నారాయణపేట జిల్లా ప్రజాబలం ప్రతినిధి:రాష్ట్రంలో మొదటి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లి గ్రామంలో దళిత మహిళ బంగలి దేవమ్మ , భర్త నర్సింగ్‌ దంపతుల ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. ఇండ్ల నిర్మాణానికి పత్రాలు అందుకున్న గ్రామ మహిళలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ని కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు , సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి , లోక్‌ సభ సభ్యురాలు డీకే అరుణ తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking