జమ్మికుంట వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలింత మృతి.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 14

జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల నిండు బాలింత మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే వీణవంక మండలం శ్రీరాముల పేట గ్రామానికి చెందిన మానస 27 సంవత్సరాలు రెండవ కాన్పు కొరకు సోమవారం రోజున జమ్మికుంట పట్టణంలోని శ్రీరామ హాస్పిటల్ కు తీసుకువచ్చారు వైద్యులు మానసకు ఆపరేషన్ చేసిన అనంతరం తీవ్రమైన నొప్పి రావడంతో మానస లోబీపీకి గురైనట్టు వైద్యులు గుర్తించి మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు అప్పటికే మానస పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మంగళవారం రోజున హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించే క్రమంలో మానస మృతి చెందింది.మానస మృతికి కారణం జమ్మికుంట వైద్యులేనని. మృతురాలి బంధువులు జమ్మికుంట హాస్పిటల్ ఎదురుగా మృతదేహంతో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న జమ్మికుంట టౌన్ ఇన్చార్జి సిఐ సురేష్. హుజురాబాద్ రూరల్ సీఐ సంతోష్..లు పోలీస్ బలగాలతో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తన భార్యకు మత్తు డోసు ఎక్కువ ఇవ్వడం వలన. మృతి చెందిందని భర్త శ్రీకాంత్. పోలీసులకు ఫిర్యాదు చేశారు.రోగుల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి అర్హత లేని డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేసి డాక్టర్ పట్టాను రద్దు చేయాలని.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బహుజన సమాజ్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు వాసాల రామస్వామి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking