ఫిబ్రవరి16 దేశవ్యాప్త కార్మిక సమ్మె & గ్రామీణ బంద్ కు విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ

 

ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 14
ఇల్లందకుంట మండల కేంద్రంలో దేశవ్యాప్తంగా ఈనెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జంబుకం. వెంకన్న మాట్లాడుతూ ఫిబ్రవరి 16 దేశవ్యాప్త సమ్మెలో సిఐటియు తో పాటు 97 కార్మిక సంఘాలు కిసాన్ సంయుక్త మూర్ఛ వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. ఈ సమ్మె ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కొడ్లను తీసుకురావడం జరిగిందని అన్నారు . దీనివల్ల కార్మికుల హక్కులు నిర్వీర్యం అయ్యాయి. రోజుకు 178 రూపాయలతో బ్రతకండని బిజెపి ప్రభుత్వం నిర్ణయం చేసినది.నిరుద్యోగ సైన్యం పెరిగినది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, స్కీం వర్కర్లకు పని భద్రత లేకుండా పోయినది. అసంఘటిత రంగ కార్మికులు హమాలీ, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్,భవన నిర్మాణ కార్మికులకి, గ్రామ పంచాయతి వర్కర్స్,ఆశ, అంగన్వాడీ,పశు మిత్ర కార్మికులకు కనీస వేతనం అమలు చేయడం లేదు.కార్పోరేట్ సంస్థలకు 2లక్షల 14 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినది.అందుకని కార్మికవర్గం కార్పొరేట్ల బీజేపీ పార్టీనీ పార్లమెంట్ ఎన్నికల్లో గద్దె దించడానికి సిద్దం అయ్యింది.దేశవ్యాప్త కార్మిక సమ్మెతో పాటు గ్రామీణ రైతు, వ్యవసాయ కార్మిక వర్గం గ్రామీణ బంద్ విజయవంతం చేయాలని కోరారు.తెలంగాణ బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు)ఇల్లందకుంట మండలం సమోఖ్య సమ్మె ఇల్లందకుంట భవన నిర్మాణ కార్మిక సంఘం
మండల అధ్యక్షులు.చిలువేరి కొమురయ్య
ఉపాధ్యక్షులు.రేణుకుంట్ల సారయ్య,మండల ప్రధాన కార్యదర్శి,రావుల ఎల్లయ్య
గ్రామ అధ్యక్షులు,గోలి క్రిష్ణామూర్తి,గుండ్ల మొగిలి.,తాడెం శ్రీనివాస్
,మారెపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking