కులరహిత సమాజం రావాలంటే కులాంతర వివాహాలే ఒక మార్గం.,
….సాహసం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మారావు
సంగారెడ్డి ఏప్రిల్,19 ప్రజ బలం ప్రతినిది;
కుల మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి వారికి రక్షణగా నిలబడాలని, కులరహిత సమాజం రావాలంటే కులాంతర వివాహాలే ఒక మార్గం అని, మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బహుజన సమాజానికి ఎప్పుడో పిలుపునిచ్చారని సాహసం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మారావు అన్నారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం, ముదిమాణిక్యం గ్రామానికి చెందినగ ఇందూరి అశ్విని (బిసి), కల్లపల్లి అఫ్రోజ్ మైనారిటీ (ముస్లిం) చిన్ననాటి నుండి ఒకరినొకరు ఇష్టపడి 2021లో వారు ఇరువురు పెళ్లి చేసుకుంటే కులం పేరుతోటి మతం పేరు తోటి ఇరువురి కుటుంబ పెద్దలు కలిసి వీరిని విడదీయడం సరైనది కాదని పద్మారావు అన్నారు. ఈరోజు అశ్విని అఫ్రోజ్ గార్లు సాహసం నాయకులను, బహుజన సంఘాల నాయకులను ఆశ్రయించడంతో, ఇరువురి అంగీకార పత్రాన్ని స్వీకరించిన సంఘ నాయకులు సంగారెడ్డి పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఇరువురికి వివాహం జరిపారు.
ఈ కార్యక్రమంలో సాహసం కార్యనిర్వాహక అధ్యక్షులు బేగరిహరి, కిరణ్ కుమార్, రమేష్, మల్లేష్, జై భారత్ రాష్ట్ర అధ్యక్షులు కాశపాక ఇమ్మయ్య, బహుజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎర్రవరం దేవదాస్, జన జాగృతి సేన అధ్యక్షులు బంగారు కృష్ణ, చైతన్య దర్పణం పత్రిక ఎడిటర్ రాముని అశోక్, తదితరులు పాల్గొన్నారు.