జిల్లాలో నియోజకవర్గాల వారీగా అభివృద్ధి నివేదికలను రూపొందించాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 19:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపై ఆయా నియోజకవర్గాల వారీగా ప్రగతి నివేదికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. బుధవారం శామీర్పేటలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యనాయక్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మోహన్రావు, జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రగతి నివేదికల తయారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2014-–2015 సంవత్సరం నుంచి 2022–20-23 సంవత్సరం వరకు ఆయా ఆర్థిక సంవత్సరాలలో నియోజకవర్గాల వారీగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై నివేదిక రూపొందించాలని, అదే విధంగా అప్పట్లో జరిగిన పనులు, ప్రస్తుతం జరిగిన పనులకు సంబంధిత శాఖల అధికారులు అభివృద్ధి పనుల ఫొటోలతో కూడిన నివేదికలో మేడ్చల్ నియాజకవర్గంకు సంబంధించి ఈ నెల 25వ తేదీలోగా పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించి సమర్పించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఆయా సంక్షేమ శాఖలు 2014 నుంచి 2022 వరకు వారు చేపట్టిన పనులకు సంబంధించి పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని, నిర్ణీత గడువులోగా అన్ని ప్రగతి నివేదికలను సీపీవో కార్యాలయంలో అందించాలని కలెక్టర్ సూచించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఐదు నియాజకవర్గాలు ఉన్నాయని అందులో మేడ్చల్ నియాజకవర్గానికి సంబంధించి ఈ నెల 25వ తేదీన , మిగితా నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి, ప్రగతి నివేదికలను ఈనెల 30వ తేదీలోగా సమర్పించాలని అధికారులను కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి పనులను అప్పట్లో చేపట్టిన వాటిని ప్రస్తుతం ఉన్న వాటికి సంబంధించి స్పష్టమైన వివరాలు, అభివృద్ధి, పురోగతి సంబంధిత ఫొటోలతో కూడిన ప్రదేశాలు, ప్రాజెక్టులు పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం అధికారులు నిబద్దతతో పనిచేయాలని సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాలలో ముందుండే విధంగా కృషి చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking