కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపాలిటీ కమిషనర్ మోహన్

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో 2వ వార్డు లో కౌన్సిలర్ మామిడి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ ఆనంద్, సత్యనారాయణ,బాలనర్సయ పర్యవేక్షణ జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని తూప్రాన్ మున్సిపాలిటీ కమిషనర్ మోహన్ ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ కమిషనర్ మోహన్ మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మక చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మున్సిపల్ లోని 16 వార్డుల్లో ఆశేష జనావాహిక మధ్య ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వైద్యుల పర్యవేక్షణలో అద్భుతంగా కొనసాగుతుందన్నారు. నేనే మున్సిపాలిటీ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని కంటి చూపుతో బాధపడుతున్న వారు ఏవైనా లోపాలు ఉంటే సరి చేసుకోవాలని మరియు కంటి అద్దాలు తీసుకోవాలని అదేవిధంగా మున్సిపల్ లోని వివిధ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మున్సిపాలిటీ చైర్మన్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, మామిడి వెంకటేష్, బొంది వెంకట్ గౌడ్, దుర్గారెడ్డి, రవీందర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంజనేయులు, పోతురాజు కృష్ణ, చందకృష్ణ, వెంకటేష్ యాదవ్, మండల ఆర్ఎంపీ పి.ఎం.పి అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ స్వర్గల శ్రీనివాస్, మహేష్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking