అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు.

 

ఇద్దరు అరెస్టు, రెండు సెల్ ఫోన్లు, 10.3 కిలోల గంజాయి స్వాధీనం.

తూప్రాన్,
మనోహర బాద్, నవంబర్, 13. ప్రజాబలం న్యూస్

అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను మెదక్ జిల్లా మనోహర బాద్
పోలీస్ స్టేషన్
సబ్ ఇన్స్పెక్టర్ సుభాష్ గౌడ్, తన సిబ్బంది తో కలిసి చాక చక్యంగా వల పన్ని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కై కోర్టుకు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.
ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా మనోహర బాద్ మండలం జీడిపల్లి హైవే రోడ్డు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద ఒక 30 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బంది, క్లూస్ టీం తో కలిసి వెళ్ళి చూడగా ఒక 30 ఏళ్లు కలిగిన వ్యక్తి ఒక నల్లని ప్లాస్టిక్ కవర్ పట్టుకొని ఉన్నాడు. అతను పోలీస్ లను చూడగానే అతని చేతిలోని
కవర్ భ్యాగ్ ను చెట్ల పొదల్లోకి విసిరేసి పారిపోవడానికి ప్రయత్నించడం గమనించి అతన్ని పట్టుకుని విచారించగా గంజాయి విక్రయిస్తున్నట్లు ఒప్పుకోగా ఎక్కడి నుండి తెచ్చి అమ్ముతున్నావని అడుగగా శ్రీధర్ సాహు వద్ద నుంచి కిలో చొప్పున కొని ఇక్కడ అమ్ముతున్నానని తెలిపారు. అతన్ని వెంటపెట్టుకొని శ్రీధర్ సాహు వద్ద కు వెళ్లి విచారించగా మంచం కింద ఉన్న జిబ్ బ్యాగ్ నుంచి 6 బ్రౌన్ కలర్ ప్యాకెట్లు తీసి ఇచ్చాడని తెలిపాడు. అనంతరం రంజాన్ కుమార్, శ్రీధర్ సాహు లను అరెస్టు చేసి, రెండు సెల్ ఫోన్లు, 10.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరూ దండుపల్లి ఐటిసి పైపుల కంపని డ్రైవర్లు గా పని చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తోపాటు తూప్రాన్ డిఎస్పీ వెంకట్ రెడ్డి, సిఐ రంగ కృష్ణ, ఎస్ ఐ లు సుభాష్ గౌడ్, శివానందం, పోలీస్ కానిస్టేబుల్ లు ప్రసాద్, అనిల్, శ్రీనివాస్ గౌడ్, భిక్షపతి లు పాల్గొన్నారు . ఈ కేసులో పాల్గొన్న డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ రంగాకృష్ణ గౌడ్ ఎస్ఐ సుభాష్ గౌడ్ , శివానందములను , కానిస్టేబుల్ ప్రసాద్ అనిల్, శ్రీనివాస్ గౌడ్ పోలీస్ లను మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking