ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 28 : రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలలో భాగంగా జిల్లాలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నాగర్ ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శైలజతో కలిసి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో భాగంగా జిల్లాలో పరీక్షల నిర్వహణ కొరకు 25 పరీక్షలను ఏర్పాటు చేయడం తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్లు, సిబ్బంది నినియచడం జరిగిందని తెలిపారు. పరీక్షలలో ఎలాంటి మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిబంధనల మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొనే విధంగా ఆర్ టీ సీ ద్వారా సమయానుకూలంగా బస్సులు నడిపించడం జరుగుతుందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు, మూత్రశాలలు,పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా సౌకర్యాలు కల్పించడంతోపాటు అత్యవసర సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 6 వేల 63 మంది జనరల్, 1 వేయి 132 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరు కావాలసి ఉండగా మొదటి రోజున 5 వేల 672 మంది జనరల్,1వేయి 39 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరయ్యారని తెలుపారు.అనంతరం డిసిపి సుధీర్ రామ్ నాథ్ కేకన్ తో కలిసి మిమ్స్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సంబంధించిన శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking