నివాళులర్పించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 28 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని చిరునోముల గ్రామానికి చెందిన తెల్లబోయిన వెంకమ్మ సేవలు చిరస్మరణీయమని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వెంకమ్మ దశదిన కర్మలు బుధవారం చిరునోముల గ్రామంలో జరిగాయి.ఈ కార్యక్రమానికి మేకల మల్లిబాబు యాదవ్ హాజరై వెంకమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వెంకమ్మ మృతి చెందడం యాదవ సంఘానికి తీరనిలోటని, నిరుపేద కుటుంబాలకు వెంకమ్మ బాసటగా నిలిచిందని, ఆమె సేవలు మరువలేమని అన్నారు ఈ కార్యక్రమంలో పుచ్చకాయల సత్యనారాయణ, కే లోతు భాస్కర్ నాయక్ గుమ్మడి సైదులు గంగుల పుల్లయ్య మార్తి శ్రీను గంగుల వేలాద్రి పుచ్చకాయల అప్పారావు తాళ్ల గూడెం యూత్ సభ్యులు పెరుగు రాము, వెంకటేష్ పుచ్చకాయల ప్రభాకర్ నల్లమోతు నగేష్ సింగం వెంకటరాములు సింగం రామకృష్ణ ,వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వెంకమ్మ అభిమానులు తదితరులు పాల్గొన్నారు