కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రైతు దినోత్సవం

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ డిసెంబర్ 23: బొమ్మరాసిపేట్ లో శామీర్ పేట్ కెనరా బ్యాంకు వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా ఎర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో వ్యవసాయ ఋణాల మరియు పనిముట్ల గురించి తెలియజేయడం జరిగింది అలాగే శమీర్పేట్ మండల అధికారి రవి కుమార్ మరియు వ్యవసాయ అధికారి రమేష్ యాదవ్ మాట్లాడుతూ, ఏ కాలములో ఎలాంటి పంటలు వేసుకోవాలని రైతులకు సూచనలు ఇవ్వడం జరిగింది.కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు లక్ష్మీకాంత్ రెడ్డి మరియు సతీష్ మరియు శామీర్ పెట్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాగర్ , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బీమా పథకాలను బ్యాంక్ అకౌంట్ కలిగిన ఉన్న ప్రతి వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది.
అందులో భాగంగా కెనరా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్కీములు, ఆర్థిక సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ
ఈ కార్యక్రమములో శామీర్ పేట్ సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్స్
ఇ.జ్యోతి.ఎం.శ్రీకాంత్ ,జి సౌందర్య మరియు గ్రామ రైతులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.అలాగే అక్కడ ఏర్పాటుచేసిన “జన సురక్ష శాచురేషన్ క్కేంద్ర ప్రభుత్వ పథకాలైన సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు గల బ్యాంకు ఖాతాదారులకు అనుకోని దుర్ఘటన దుర్మరణం, వైకల్యం కలిగినా బీమా పథకాలు వారి కుటుంబానికి అండగా నిలుస్తాయన్నారు . లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని విధంగా మరణం సంభవించినప్పుడు వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకంలో చేరిన వ్యక్తి మరణించిన లేక శాశ్వత వైకల్యం పొందిన 2 లక్షల వరకు పొందవచ్చు అన్నారు. పాక్షిక అంగవైకల్యానికి లక్ష రూపాయల బీమా పరిహారం వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఆర్థిక సైబర్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ఆన్లైన్ మోసాలు, పెట్టుబడులను ఆకర్షితులు కాకుండా బ్యాంకుల ద్వారా ప్రజలకు అందించే ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బీమా పథకాలు కుటుంబానికి భరోసాగా నిలుస్తాయి అన్నారు.ఆడపిల్లల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలన్నారు. అనంతరం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు రైతులు అందరూ కలసి విజయవంతం చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking