హైదరాబాద్; అంతర్జాతీయ స్థాయిలో టైక్వాండో ప్రతిభను వెలికి తీసేందుకు ఈ నెల 12 నుంచి నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు శ్రీనగర్ టీం ఓనర్ ప్రముఖ మెజీషియన్ సామల వేణు తెలిపారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీం మేనేజింగ్ డైరెక్టర్ గిరిబాబు, డైరెక్టర్ సుప్రియ లతో కలిసి మాట్లాడారు.. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల నుంచి 12 టీములలో దాదాపు 75 మంది ప్లేయర్స్ పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మొదటి రోజు యూఏఈకి చెందిన సింగర్ అహ్మద్ ఆల్ హాసాని పాల్గొని జనగణమన తో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. చివరి రోజు దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బు అబ్దుల్లా ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి యూఏఈకి చెందిన వ్యాపారవేత్త కవితా శ్రీనివాసన్, శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి లతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు.