రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి.మంత్రి సీతక్క
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజ రాజేశ్వర గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా సమన్వయకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్, గిరిజన శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి అనసూయ సీతక్క హాజరై మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందన్నారు. సరస్వతి దేవి కొలువైన ప్రాంతంలో ఎందరో మహనీయులు పుట్టిన ప్రాంతం ఆదిలాబాద్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నన్ను ఇన్చార్జిగా నియమించడం నా అదృష్టమన్నరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ పై ఎంతో ప్రేమ ఉందన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్యటన సైతం ఇక్కడినుండే మొదలుపెడతారన్నారు. హైదరాబాదులో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించరన్నరు.ఓడిన అభ్యర్థులు సైతం ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలు తీర్చేందుకు ముందుండాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆటో సంఘాలతో ఆందోళన చేయించిన ఘనత బిఆర్ఎస్ది అన్నారు.తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుండే కాంగ్రెస్ ప్రభుత్వంపై బి ఆర్ ఎస్ దూషించడం మొదలుపెట్టిందన్నారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు.