మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా యాదవలకు వంద రోజులలో గొర్రెలు ఇవ్వడం ఖాయం

 

పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి జనవరి 10 (ప్రజాబలం) ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలతో పాటు గత ప్రభుత్వం చేసిన మోసాలను గ్రహించి కురుమ యాదవుల కు వంద రోజులలోగొర్రెలు ఇస్తామనిప్రకటించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, తప్పకుండా డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి గొర్రెలు ఇవ్వడం జరుగుతుందని పొంగులేటి ప్రధానాంచరుడు తీసి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు బోనకల్ మండల కేంద్రంలో జరిగిన యాదవ కురుమల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ దాదాపు రెండు సంవత్సరాల నుండి గొర్రెలు ఇస్తామని డీడీలు కట్టమని మోసం చేసిన ప్రభుత్వమును ఓడించి కురుమ యాదవులు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కీలక పాత్ర పోషించారని, గత ప్రభుత్వం తప్పులు చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొర్రెలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో అధికార పార్టీ అండతో దళారీలు, కొంతమంది అధికారులు, ఆంధ్రాలోని బేరగాళ్లతో కుమ్మక్కై గొర్రెలు రీసైక్లింగ్ జరిగిందని, ఆరోపణలు రావడంతో వారిపై విచారణ జరుగుతూ ఉందని, ఇలాంటి మోసాలను కప్పిపుచ్చుకోవడానికి దొంగే దొంగ అన్నట్లు సామెతగా గొర్రెలు ఇవ్వాలని, న్యాయం చేయాలని, ధర్నాలు ఆందోళనల పేరుతో సోషల్ మీడియా ద్వారా రకరకాల కుయుక్తులు పన్నుతున్నారని, అలాంటి వాటిని నమ్మవద్దని కురుమ యాదవులు అధైర్య పడవద్దు అని, తప్పకుండా గొర్రెలు వస్తాయని హామీ ఇచ్చారు.
NLM, స్కీం ద్వారా వచ్చే గొర్రెల కు బ్యాంకు గ్యారంటీ లేకుండా గొర్రెల ను ఇప్పించాలని, ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని, ప్రతి గొర్రెకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, గొర్రెలకు షెడ్లు ఏర్పాటు చేయాలని ఎన్ సి డి సి స్కీమును కొనసాగించాలని మల్లి బాబు యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బమ్మిడి శ్రీనివాస్ యాదవ్, గుమ్మ సైదులు, గంగుల గోపి గంగుల నాగయ్య గంగుల పుల్లయ్య, నరసింహారావు ఆళ్ల వెంకటేశ్వర్లు, గంగుల రమేష్ ముక్కాని రాము, గంగుల శ్రీనివాస్ జక్కుల గోపి, మారుతి శ్రీనివాస్ జాల అశోక్, గుమ్మ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking