మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 08 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ బాలికల కళాశాలలో మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు,కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఎం లలిత కుమారి తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లలిత కుమారి మాట్లాడుతూ… మహిళలందరూ అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ముందడుగు వేస్తున్నారని, ఇంతటితోనే ఆగిపోకుండా ప్రతి మహిళ కూడా మహిళా సాధికారత కలిగి,ఈ సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదగాలని, అందుకొరకై విద్యావంతులమైన మనం తర్వాత తరాలను విద్యావంతులుగా తయారు చేయవలసిన బాధ్యతను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని,ముందుగా పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయినులకు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో అంతర్జాతీయ దినోత్సవం పై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేశారు.అనంతరం కళాశాలలో పనిచేస్తున్న వైస్ ప్రిన్సిపల్ కే. మహేశ్వర రావు,ఆఫీస్ సూపర్డెంట్ ఎం రాజు, సబ్జెక్టు ఫ్యాకల్టీలు వీరన్న,వినయ్ లు సంయుక్తంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించుటకై ఏర్పాటుచేసిన సభలో మహిళల యొక్క గొప్పతనాన్ని,మహిళా దినోత్సవం జరుపుకోవడానికి జరిగిన పోరాటాల చరిత్రను వివరిస్తూ,ఈ సందర్భంగా తనతో పాటుగా,కళాశాలలోని మహిళా ఉపాధ్యాయినులను,మహిళా సిబ్బంది యావన్మందిని సంప్రదాయబద్ధంగా శాలువాలతో సత్కరించారని కూడా లలిత కుమారి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బందితో పాటు విద్యార్థి నులందరూ పాల్గొన్నారనీ వివరించారు.