గాంధారి ఖిల్లా జాతరకు మంత్రి సీతక్క కు ఆహ్వానం

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కు ఆహ్వానం

ప్రజాబలం చెన్నూర్ నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 30:

మందమర్రి మండలంలోని గాంధారి ఖిలాలో పీబ్రవరి 14 నుండి 16వరకు మూడు రోజుల పాటు జరిగే గాంధారి ఖిలా మైసమ్మ జాతరకు రావాలని కోరుతూ మంత్రి సీతక్కకు, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేకానందకు ఆహ్వాన పత్రికలను ఆదివాసీ నాయక్ పోడ్ సేవా సంఘం నాయకులు అందించారు. మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ జాతర సందర్బంగా ఆదివాసుల నాయక్ పోడ్, గోండులు, కొయ్యలు, మన్నె జాతుల వారు కొలిచే అర్ద్యాధవ్యమైన గాంధారీ ఖిలా మైసమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుపుతామని మంత్రి వర్యులు సీతక్క కు వివరించి పిబ్రవరి 14, 15,16 తేదీలలో జరుగబోయే గాంధారి ఖిల్లా మహా జాతరకి ఆహ్వానించినట్లు ఆదివాసి నాయక్ పోడ్ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking